సంగీత త్రిమూర్తులలో ప్రముఖులైన శ్రీ త్యాగరాజ స్వామి వారి పేరుతో స్టాపించబడిన శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల – రాంకోటి, హైదరాబాద్ వెబ్ సైట్ ప్రారంబోత్సవ సందర్బముగా కళాభిమానులకు, విధ్యార్దులకు శుభాకాంక్షలు.
1952 వ సంవత్సరంలో పూర్వ తెలంగాణా రాష్ట్రంలో ప్రారంభమైన ఈ కళాశాల రాష్ట్రంలో మొట్టమొదటి కళాశాల. ఎందరో సుప్రసిద్దులైన ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు ఈ కళాశాలలో పనిచేసారు. ఈ కళాశాలలో విధ్యార్ధులు గా వారు కాలక్రమంలో అధ్యాపకులుగా, ప్రిన్సిపాల్స్ గా పనిచేయడం ఈ కళాశాల ప్రత్యేకత.
ఈ కళాశాల పూర్వ విధ్యార్ధులు ఆకాశవాణి నిలయ విద్వాంసులుగా, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో అధ్యాపకులుగా పనిచేయుచున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 1500 విధ్యార్ధులు సంగీత, నృత్యాలు అభ్యసిస్తున్నారు. సామాన్యులకు అందుబాటులో అతి తక్కువ ఫీజులతో నడపబడుచున్న ఈ కళాశాల విధ్యార్ధుల కోసం ఎన్నోకార్యక్రమాలు నిర్వహిస్తున్నది.